![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -514 లో.....వల్లికి అబార్షన్ అయిందని చెప్పిన హాస్పిటల్ కి నర్మద వెళ్తుంది. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీ హాస్పిటల్ లో గైనకాలజిస్టు మెరుపుతీగ డాక్టర్ ని కలవాలని అడుగుతుంది. అలాంటి డాక్టర్ ఎవరు లేరని డాక్టర్ చెప్తాడు. లేదు సర్ ఆ రోజు మాకు తెలిసిన ఆవిడకి ఆక్సిడెంట్ అయింది ఇక్కడికి తీసుకొని వస్తే అబార్షన్ అయిందని అన్నారని నర్మద చెప్తుంది.
అసలు మొన్న హాస్పిటల్ లో డాక్టర్ లు ఎవరు లేరు క్యాంప్ కి వెళ్ళామని డాక్టర్ చెప్తాడు. ప్లీజ్ ఒక్కసారి కనుక్కోండి అని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. సరే అమ్మ ఇదేదో ప్లాన్ ప్రకారం జరిగినట్లు ఉంది.. మీరు కూడా కనుక్కోండి అని డాక్టర్ చెప్తాడు. సరే అని నర్మద వెళ్తుంది. అక్కడే హాస్పిటల్ లో మెరుపుతీగ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తుంది. మరొక వైపు ప్రేమని ఎలాగైనా సొంతం చేసుకోవాలని రాజా పుష్పం ట్రై చేస్తాడు. ప్రోగ్రాం లో తన పర్ఫామెన్స్ లాస్ట్ కి వచ్చేలా సెటిల్ చేస్తాడు. డోర్ దగ్గరికి వచ్చి డోర్ తియ్యమని అంటాడు. మరొకవైపు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని ధీరజ్ టెన్షన్ పడుతాడు. అప్పుడే నర్మద వచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం చెప్పాలనుకుంటుంది కానీ ప్రేమ రాలేదన్న టెన్షన్ లో ధీరజ్ ఉంటాడు. ప్రేమ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళిందని ధీరజ్ చెప్తాడు. వద్దన్న ఎందుకు వెళ్ళిందని నర్మద అంటుంది. అప్పుడే రామరాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ప్రేమ ఇంకా రాలేదని తెలిసి వెళ్లి దగ్గరుండి తీసుకొని రా అని రామరాజు చెప్తాడు.
మరొకవైపు రాజాపుష్పం లైట్ ఆఫ్ చేస్తాడు. దాంతో ప్రేమ బయటకు వస్తుంది. మళ్ళీ లైట్ ఆన్ చేస్తాడు. అతను దగ్గరికి వస్తుంటే ప్రేమ భయపడుతుంది. ఫోన్ లాక్కొని వెళ్లి మళ్ళీ డోర్ వేసుకుంటుంది. ధీరజ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఆ తర్వాత డోర్ పగులగొట్టి రాజా పుష్పం లోపలికి వెళ్తాడు. ప్రేమ భయపడుతుంది. అప్పుడే ధీరజ్ వచ్చి రాజాపుష్పాన్ని కొట్టి ప్రేమని సేవ్ చేస్తాడు. ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |